అయోమయంలో రామ్ చరణ్??? What Happend Ram Charan???
రామ్ చరణ్ గత మూడు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. ఎవడు, తుఫాన్ పూర్తి చేసిన తర్వాత అతని కొత్త సినిమా ఇంతవరకు సెట్ మీదకి వెళ్లలేదు. ముందుగా కథ ఓకే అయినా కానీ కొరటాల శివ చిత్రాన్ని తర్వాత వద్దనుకున్నాడు. దాంతో చరణ్‌కి గ్యాప్ పెరిగిపోయింది. కొరటాల సినిమా కాన్సిల్ కావడంతో చరణ్‌కి కృష్ణవంశీ సినిమా క్యూలోకి వచ్చింది. ఈ చిత్రం కూడా ఇంతవరకు మొదలు కాలేదు. ముందుగా మల్టీస్టారర్ చేద్దామనుకుంటే, వెంకటేష్ ఈ చిత్రంలో నటించనని చెప్పాడట. దాంతో ఈ కథ మళ్లీ మొదటికి వచ్చింది. చరణ్ కమిట్ అయిన ఇతర దర్శకులెవరూ కథల్లేవని చెబుతున్నారు. త్రివిక్రమ్ ఎప్పుడు చరణ్ కోసం కథ రెడీ చేస్తాడనేది తెలీదు. మరోవైపు అతని ఎవడు సినిమా డిసెంబర్ 19న విడుదల చేస్తామని దిల్ రాజు అంటున్నాడు. కానీ సంక్రాంతికి విడుదల చేస్తే లాభముంటుందని, డిసెంబర్‌లో రావడం వల్ల సినిమా నష్టపోతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇంకా ఆ సినిమా విడుదలపై చరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే ఏడాది వరకు అతని కొత్త సినిమా కూడా మొదలయ్యేలా లేదు. మూడు నెలల క్రితం వాయువేగంతో దూసుకుపోతున్నట్టు కనిపించిన చరణ్‌కి సడన్‌గా బ్రేకులు పడిపోయాయి పాపం......

No comments:
Post a Comment