సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలోనే బాలీవుడ్ క్రిటిక్ అనుపమా చోప్రాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఇంటర్వ్యూ లో పవన్ ఇచ్చిన ఆన్సర్స్ మేం ఇస్తున్నాం.. క్వశ్చన్స్ మీరు ఊహించుకోగలరుగా..
“నేను అనుకోకుండా యాక్టర్ అయ్యా. నిజానికి నేను రైతు కావాలని అనకున్నా”
“సినిమాల్లో చాలా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటా. నిజ జీవితంలో ఇవన్నీ పాటించడం సాధ్యం కాదు. ఇది నన్ను ఇబ్బంది పెట్టే విషయం”
“నిజ జీవితంలో కూడా నా గొంతు వాదన వినిపించేందుకే రాజకీయాల్లోకి వచ్చా”
“సినిమాలే అన్నీ కాదు. జీవితం సినిమా కంటే చాలా పెద్దది”
“ఏదైనా సరే చెప్పడం నాకు చాలా ముఖ్యం. దేనికన్నా సరే ఇదే ఎక్కువ. నాకు నేను నిజాయితీగా ఉండాలని అనుకుంటా”
“నిజ జీవితంలో మనలో చాలా రకాల కోణాలుంటాయి. కానీ నేను నెగిటివ్ రోల్ చేయలేను. నేను అంత గొప్ప యాక్టర్ ని కాదు”
“నేను అభిప్రాయం కోసం చాలా మందినే అడుగుతూ ఉంటా. కానీ నిజాయితీగా ఒపీనియన్ పొందడం కష్టమైన విషయం”
“నేను సైలెంట్ గా ఉన్నపుడు వర్క్ చేయడం లేదడం అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు”
“ఇండియాలో సినిమా తీయడం చాలా కష్టమైన విషయమే. ఇక్కడ అన్నీ కావాలి. సరైన పాళ్లలో ఉండాలనడమే కష్టం.”
“షూటింగ్ లేనపుడు ఓ దెయ్యం లాగా చదువుతూనే ఉంటా నా తిండి నేనే పండిస్తా”
“లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలని భావిస్తా. ఇంకా బెటర్ గా ఉండాలని అనుకుంటా”
“నేనిప్పుడు సినిమాల మీదే దృష్టి పెట్టా. లైఫ్ లో నేను సెటిల్ అయ్యేందుకే ఇదంతా. కొన్నేళ్లలో సినిమాలు వదిలేస్తా”
“రాజకీయాల్లో పండోరా బాక్స్ లాంటివి. నేను నా అంతర్గతంగా వచ్చే శబ్దాన్ని ఆపలేను. నేను రాజకీయాల్లోకి దిగానంటే సినిమాలు వదిలేస్తా”
“సినిమాలు మానేశాక రాయడం మాత్రం కంటిన్యూ చేస్తా నేను రాయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తా”
“మీ పని మీరు చేసి అక్కడి నుంచి వెళ్లిపోండి.. అనే నేను చెప్పేది. అంతకంటే ఎక్కువగా నేను ఆలోచించను.”
intresting . thanks for sharing the post!
ReplyDeletehttp://trendingandhra.com